మెగాస్టార్ చిరంజీవికి నేడు ఆపరేషన్
- February 03, 2016తన భుజానికి అయిన గాయానికి మెగాస్టార్ చిరంజీవి నేడు శస్త్రచికిత్స చేయించుకోనున్నారు. ఇప్పటికే ఆయన ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఇక నేడు ఆపరేషన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి అయినట్టు తెలుస్తోంది. తన 150వ సినిమాగా తమిళంలో సూపర్ హిట్టయిన 'కత్తి' చిత్రాన్ని ఎంచుకున్న ఆయన, షూటింగ్ ప్రారంభమయ్యే ముందే ఈ ఆపరేషన్ ముగించేసుకోవాలని భావించినట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా, చిరు వెంట ఆయన భార్య సురేఖ కూడా ఉన్నారు. ఆపరేషన్ ముగిసిన తరువాత దాదాపు రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వుంటుందని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఆపరేషన్ తరువాత పూర్తిగా కోలుకున్నాకనే చిరంజీవి హైదరాబాద్ వస్తారని తెలుస్తోంది.
తాజా వార్తలు
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు
- భారత్-ఒమన్ మధ్య పెరిగిన విమాన ఛార్జీలు..!
- కువైట్ లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం
- ఏపీలో 9.05 శాతం..తెలంగాణలో 9.51 శాతంగా పోలింగ్ నమోదు
- సీబీఎస్ఈ క్లాస్ 10 ఫలితాలు విడుదల..
- ఏపిలో పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు..
- తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్