అబుదాబీ కార్మికుడికి 100,000 డాలర్ల ప్రైజ్‌మనీ
- February 03, 2016
అబుదాబీలోని బంగ్లాదేశీ కార్మికుడికి ఊహించని విధంగా బంపర్ ప్రైజ్ దక్కింది. 32 ఏళ్ళ ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్ సలాఉద్దీన్‌మొహమ్మద్ ఇషాక్ 100,000 (367,000 దిర్హామ్‌లు) ప్రైజ్ మనీ పొందాడు. యూఏఈ ఎక్స్‌ఛేంజ్ నిర్వహించిన 'సెండ్ మనీ - విన్ డాలర్స్' కాంటెస్ట్‌లో ఈ ప్రైజ్ మనీ అతనికి లభించింది. ప్రైజ్ మనీ లభించిందన్న విషయం తెలిసి తాను నమ్మలేకపోయాననీ, తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యానని విజేత ఇషాక్ చెప్పారు. 2015లో చాలాసార్లు డబ్బుని బంగ్లాదేశ్‌కి పంపాననీ, అయితే ఇలాంటి ప్రైజ్ మనీ తనకు దక్కుతుందని ఎప్పుడూ ఊహించలేకపోయానని ఆయన అన్నాడు. జనవరి 18, 21న తీసిన డ్రాలో విజేతల్ని ప్రకటించారు. ఇంకో ఐదుగురు విజేతలకు 10,000 డాలర్ల చొప్పున ఇవ్వనుండగా, 50 మందికి 1,000 డాలర్ల చొప్పున బహుమతి ఇవ్వనున్నారు నిర్వాహకులు.
తాజా వార్తలు
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!







