'APNRT' గురించి డా|| రవి కుమార్ వేమూరు తో ముఖాముఖి

- February 04, 2016 , by Maagulf
'APNRT' గురించి డా|| రవి కుమార్ వేమూరు తో ముఖాముఖి

1)  APNRT ఏర్పాటుకు వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యo ఏంటి?

  •  ప్రవాస తెలుగువారి అవసరాలను తీర్చేందుకు మరియు పెట్టుబడులు, విరాళాలను ఆకర్షించేందుకు, నవ్యాంధ్రప్రదేశ్ లో ప్రతి ప్రవాస తెలుగువారు భాగస్వాములు కావాలన్నముఖ్య ఉద్దేశ్యంతో ఒక అత్యుత్తమ  పారదర్శకత కలిగిన వేదికను ఏర్పాటు చేయటం జరిగింది. అదే మీ, మా APNRT.

 

2)  ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో APNRT పాత్ర ఎలా ఉండాలని అనుకుంటున్నారు?

  •  ప్రపంచ దేశాలలో స్థిరపడిన ప్రతి తెలుగువారు క్రొత్తగా ఏర్పడ్డ నవ్యాంధ్ర రాష్ట్ర అభివృద్ధికి, వారి శక్తికి తగ్గట్టుగా, వారివారి స్వంతగ్రామాలు, జిల్లాల్లో గాని లేక వారికి  నచ్చిన ఎ ఇతర గ్రామాలను/వార్డులను దత్తత తీసుకోని వాటిని స్మార్ట్ విలేజ్/వార్డులుగా తీర్చిదిద్దాలని, రాష్ట్ర ప్రభుత్వం వివిధ పరిశ్రమలకు అనువుగా గుర్తించిన ప్రాంతాలలో పెట్టుబడులు పెట్టి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో సముచిత పాత్ర పోషించాలని, వీరికి ప్రభుత్వం తమవంతు సహాయ, సహకారాలు అందిస్తూ ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తుంది.

3)  ప్రభుత్యం నుంచి APNRT ల సహకారం తీసుకోవడానికి చేపడుతున్న చర్యలేంటి?

  • APNRT కి తగిన ప్రాచుర్యం కల్పించడానికి దేశ, విదేశాల్లోని వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా అవగాహన చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వ సలహాదారు మరియు మంత్రుల బృందం అనేక దేశాల్లోని ప్రవాస తెలుగువారిని స్వయంగా కలిసి, APNRT యొక్క ప్రాముఖ్యతను తెలియజేయుటకు పలు అవగాహనా సదస్సులు నిర్యహించుచూ, వారిని చైతన్యవంతులుగా చేసి రాష్ట్ర భవిష్యత్ ప్రణాళికలో ముఖ్య భూమికను పోషించేలా ప్రోత్సహిస్తున్నారు.

 

 

4)  APNRT లకు AP లో ఎలాంటి అవకాశాలు కల్పించనున్నారు?

  • APNRT ల కోసం ప్రత్యేక సేవలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. వీటిలో ఆలయ సందర్శన రిజర్వేషన్స్, OCI/PAN/AADHAAR CARDలు పొందేందుకు సహకారాలు, పెట్టుబడి సలహాలు మరియు న్యాయసలహాలు లాంటి సేవలను అత్యంత పారదర్శక విధానాలతో కల్పిస్తుంది. ఇవే కాకుండా ప్రభుత్య నూతన పారిశ్రామిక విధానాల ద్వారా పెట్టుబడిదారులకు కల్పించే రాయితీలన్నిoటిని APNRT లకు వర్తింపజేసేట్టుగా చర్యలు చేపడుతున్నారు.

5)  APNRT ల స్పందన AP విషయంలో ఎలా ఉంది?

  • నవ్యాంద్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని ఉన్న ప్రతి ప్రవాస తెలుగువారు ఈ వేదికను ఏర్పాటు చేసినందుకు చాల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే NRI BHAVAN ల ఏర్పాటుకు సంబందించిన పెట్టుబడులకు చాలామంది ప్రవాసులు ముందుకు వచ్చి వారి సహకారాలు అందించటానికి సిద్దంగా ఉన్నారు.
  • ఇవేకాక ప్రత్యేక సేవలను, (ఆలయ సందర్శన రిజర్వేషన్లు, OCI/PAN/AADHAAR CARD పొందేందుకు సహకారాలను) చాల మంది వినియోగించుకుoటున్నారు, వారి నుంచి కూడా మంచి స్పందన లభిస్తుంది.

6)  మిగతా పెట్టుబడిదారుల నుంచి APNRT లకు ప్రత్యేకంగా కల్పించే అవకాశాలు?                                                                              

  • APNRT ల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఎకగవాక్ష విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. దీని ద్వారా NRTల పెట్టుబడులకు కావాల్సిన పర్మిషన్లు, సలహాలు, వివిధరకమైన సేవలన్నిoటిని, పారదర్శకంగా APNRT బృందం సమన్వయకర్తగా వ్యవహరించి అన్నిపనులను నిర్నీత నమయంలో పూర్తి చేయడానికి సహాయపడుతుంది. వీటన్నింటి కోసం ప్రత్యేకమైన విభాగం, వాటి పర్యవేక్షణకు కావాల్సిన అధీకృత బృంద ఏర్పాట్లను ప్రభుత్వం వేగవంతంగా సమకూర్చి, భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా ప్రవాస తెలుగువారికి మరియు ప్రభుత్వానికి వారధిగా వ్యవహరించి ఒక ప్రత్యేక సముచిత స్థానాన్ని కల్పించటానికి APNRT కృషి చేస్తుంది.  
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com