నకిలీ ఎస్ఎంఎస్ లతో మోసం..రియాద్ లో పాకిస్తాన్ గ్యాంగ్ అరెస్ట్
- July 15, 2020
రియాద్:నకిలీ ఎస్ఎంఎస్ లతో అమాయకులను మోసం చేస్తున్న ముఠా గుట్టు రట్టైంది. మీరు క్యాష్ ప్రైజ్ గెలుచుకున్నారు..మీ బ్యాంక్ వివరాలు పంపించండి..మీ ఖాతాలో డబ్బులు జమ చేస్తాం అంటూ ఎస్ఎంఎస్ పంపిస్తారు. నమ్మి బ్యాంకు ఖాతా వివరాలు పంపించిన వారి అకౌంట్లో డబ్బు కాజేస్తారు. అంతేకాదు మీకు ప్రీ అప్రూవల్ లోన్ మీ కోసం సిద్ధంగా ఉంది..మీ డిటేల్స్ ఇవ్వండి..డబ్బు అకౌంట్లో క్రెడిట్ అవుతుందని, ఇంకా కొన్ని సార్లు మీరు తక్షణమే మా ఎస్ఎంఎస్ కు స్పందించకుంటే మీ బ్యాంక్ కార్డులు బ్లాక్ అవుతాయని ఇలా అయోమయానికి గురి చేసి వారి బ్యాంకు వివరాలను సేకరించి డబ్బు కాజేయం ఈ ముఠా పని. కాజేసిన సొమ్మును పాకిస్తాన్ లోని తమ బ్యాంకు అకౌంట్లోకి బదిలీ చేస్తుంటారు. ఇలా మోసం చేస్తున్న 8 మంది సభ్యులున్న పాకిస్తాన్ ముఠాను రియాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి SR 25,000, ఏటీఎం కార్డులు, 37 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?