బహ్రెయిన్‌కి ఎమిరేట్స్ విమానాల పునరుద్ధరణ
- July 15, 2020
బహ్రెయిన్‌లో ఈ రోజు ఎమిరేట్స్ విమానం ఒకటి ల్యాండ్ అయ్యింది. బహ్రెయిన్ నుంచి దుబాయ్‌కి ఏడు వీక్లీ విమానాల్ని ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ నడపనుంది. బోయింగ్ 777-300ఇఆర్ విమానాల్ని కార్గో అలాగే ప్యాసింజర్స్ కోసం వినియోగించనుంది. దుబాయ్ నుంచి పలు ఆన్‌వార్డ్ డెస్టినేషన్స్ కూడా ప్రయాణీకులు వెళ్ళేందుకు వీలుంది. ఆసియా పసిఫిక్, యూరోప్ అలాగే అమెరికాస్‌కి సంబంధించిన డెస్టినేషన్స్ ఈ లిస్ట్‌లో వున్నాయి. కాగా, కొన్ని దేశాల్లో ఇంకా ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ కొనసాగుతున్నందున, అక్కడికి వెళ్ళేందుకు ఇంకా అనుమతులు రావాల్సి వుంది. కాగా, అన్ని జాగ్రత్తలూ తీసుకుని విమాన సర్వీసుల్ని పునరుద్ధరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మాస్క్‌లు, గ్లోవ్స్, హ్యాండ్ శానిటైజర్స్ అలాగే యాంటీ బాక్టీరియల్ వైప్స్‌ని వినియోగదారులకు విమానయాన సంస్థ అందిస్తోంది.
తాజా వార్తలు
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- Kuwait air defences intercept Iranian missile, drone attacks
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్







