9 యూఏఈ వెబ్‌సైట్స్‌పై వైరస్ ఎటాక్
- February 04, 2016
హాలిడే షాపింగ్ సీజన్, ఇ-మెయిల్ బేస్డ్ వైరస్ ఎటాక్స్‌కి వరంగా మారుతుంది. తొమ్మిది యూఏఈ వెబ్‌సైట్స్‌పై ఈ వైరస్ ఎటాక్స్ జరిగినట్లు ఫైర్ ఐ అనే నెట్వర్క్ సెక్యూరిటీ కంపెనీ వెల్లడించింది. జరిగిన తొమ్మిది వైరస్ ఎటాక్స్‌లో, నాలుగు ఫైనాన్షియల్ సర్వీసు కంపెనీలపైనే జరిగాయి. సెలవుల సీజన్లో ఒకింత అప్రమత్తత తక్కువగా ఉండే టైమ్ చూసి, వైరస్ ఎటాక్స్‌తో విరుచుకుపడుతున్నారు. డ్రైడెక్స్ అనే వైరస్‌ని ఇందులో ముఖ్యమైనదిగా గుర్తించారు. బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్ని దొంగిలించడం, బాధితుల అకౌంట్స్ నుంచి డబ్బుని లాగెయ్యడం వంటివి వైరస్ ముఖ్యమైన కార్యకలాపాలు. అలాగే ఫేర్ల్ట్ అనే మాల్వేర్ కూడా వెబ్ బ్రౌజర్స్ నుంచి సమాచారాన్ని తస్కరిస్తోంది. ఇలాంటి వైరస్ ఎటాక్స్‌పై అప్రమత్తంగా ఉండాలని యాంటీ వైరస్ తయారీ సంస్థలు, సాఫ్ట్వేర్ రంగ నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!









