యూఏఈ నుంచి వచ్చే అనధికార ఛార్టెర్డ్ విమానాలకు భారత్ లోకి అనుమతి లేదు: డీజీసీఏ
- July 16, 2020
యూఏఈ నుంచి భారత్ కు వచ్చే విమానాలకు తప్పనిసరిగా ముందస్తు అనుమతి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది డీజీసీఏ. ఈ మేరకు యూఏఈకి లేఖ రాసింది. కొన్ని చార్టెర్డ్ విమానాలు సరైన అనుమతులు లేకుండానే ప్రయాణికులను తీసుకువస్తున్నాయని అభ్యంతరం వ్యక్తం చేసింది. యూఏఈలో చిక్కుకుపోయిన వారిని వారి సొంత ప్రాంతాలకు తరలించేందుకు భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక విమానాలను నడుపుతున్న విషయం తెలిసిందే. అయితే..ఇండియాకు రావాలనుకుంటున్న వారి సంఖ్య వేలల్లో ఉండటంతో చార్టెర్డ్ విమానాలకు డిమాండ్ పెరిగింది. అయితే..భారత్ వచ్చే ఛార్టెర్డ్ విమానాలన్ని ముందస్తుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి కూడా తీసుకోవాలని గతంలోనే షరతు విధించింది డీజీసీఏ. కానీ, ఇటీవలె ఓ ఛార్టెర్డ్ విమానం మహారాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే ముంబై ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యింది. దీంతో అప్రూవల్ కోసం ప్రయాణికులు విమానాశ్రయంలోనే 12 గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పౌర విమానయాన అధికారులు..రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి పత్రాలు అందిన తర్వాత యూఏఈ నుంచి వచ్చే విమానాలకు అనుమతి ఇవ్వాలంటూ ఏటీసీకి లేఖ రాసింది. దీంతో ఇకపై యూఏఈ నుంచి భారత్ వచ్చే ఛార్టెర్డ్ విమానాలన్ని ముందుగా ఆ విమానం ల్యాండ్ అయ్యే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొంది..ఆ పర్మిషన్ లెటర్ ను ఏటీసీకి అందిస్తేనే ల్యాండింగ్ అనుమతి ఇస్తారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?