అబుధాబి:మరికొన్ని పబ్లిక్‌ పార్క్‌లు, బీచ్‌లకు అనుమతి

- July 17, 2020 , by Maagulf
అబుధాబి:మరికొన్ని పబ్లిక్‌ పార్క్‌లు, బీచ్‌లకు అనుమతి

అబుధాబి:అబుధాబి, మరికొన్ని పబ్లిక్‌ బీచ్‌లు, పార్క్‌లను తెరిచేందుకు అనుమతిచ్చింది. కోవిడ్‌19 సేఫ్టీ మెజర్స్‌ పాటిస్తూనే, ఈ పార్క్‌లు, పబ్లిక్‌ బీచ్‌లకు అనుమతులిస్తున్నారు. అబుధాబి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మునిసిపాలిటీస్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌, క్యాపిటల్‌లోనూ అలాగే అల్‌ అయిన్‌, అల్‌ దఫ్రాలో పార్క్‌లను 40 శాతం సామర్థ్యంతో తెరిచేందుకు అనుమతులు మంజూరు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు స్టెరిలైజేషన్‌ ఈ పార్కులు, బీచ్‌లలో నిర్వహించాల్సి వుంటుంది. థర్మల్‌ కెమెరాల ఏర్పాటు సహా పలు ప్రికాషన్స్‌ తీసుకోవాల్సి వుంటుంది నిర్వాహకులు. ఒక గ్రూపులో అత్యధికంగా నలుగురికి మాత్రమే అనుమతిస్తారు. బీచ్‌లకు వెళ్ళేవారు మాస్క్‌లు ధరించాలి..షవర్స్‌Oద్‌ ‌ చేసి వుంటాయి. ఫుడ్‌ మరియు బివరేజెస్‌ ఔట్‌లెట్స్‌ 30 శాతం సామర్థ్యంతో పనిచేస్తాయి. టేబుల్స్‌ మధ్య 2.5 మీటర్ల దూరం పాటించాలి. టేబుల్‌కి నలుగుర్ని మాత్రమే అనుమతిస్తారు. ప్లే ఏరియాస్‌ మూసివేసి వుంటాయి. పార్కింగ్‌ వద్ద 50 శాతం సామర్థ్యానికే అనుమతిస్తారు. దల్మా పార్క్‌, షరీయా పార్‌, కాతెమ్ పార్క్‌, వత్బా పార్క్‌, రబ్దాన్‌ పార్క్‌, షహామా పార్క్‌, గ్రీన్‌ ముబాజా పార్‌క, అల్‌ మిర్భా పార్క్‌, జాయెద్‌ అల్‌ ఖాయిర్‌ పార్క్‌లకు అలాగే అల్‌ బతినా బీచ్‌కి అనుమతులు మంజూరు చేశారు.

--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com