బహ్రెయిన్:వేసవిలో వేడి ఒత్తిడి మరియు సమస్యల నివారణకు డా.వెంకట్ రెడ్డి సూచనలు

- July 17, 2020 , by Maagulf
బహ్రెయిన్:వేసవిలో వేడి ఒత్తిడి మరియు సమస్యల నివారణకు డా.వెంకట్ రెడ్డి సూచనలు

గల్ఫ్ దేశాల్లో పెరుగుతున్న వేడి తీవ్రత దృశ్య  తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరీ ముఖ్యంగా నిర్మాణ రంగంలో మరియు ఫ్యాక్టరీలో పని చేస్తున్నా తెలుగు కార్మికులకు డాక్టర్ వెంకట్ రెడ్డి పల్నాటి, స్పెషలిస్ట్ రెస్పిరేటరీ కేర్, హెల్త్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ లో భాగంగా ఈ క్రింది సూచనలు పాటించాల్సిందిగా కోరుకుంటున్నారు.

గల్ఫ్ దేశాల్లో దానిలో భాగంగా బహ్రెయిన్ లో కూడా ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న క్రమంలో  ఆయా దేశాల కు సంబంధించిన పని వేళల నిబంధనలు మరియు నియమాలు రూపొందించబడినవి మరియు వాటిని తప్పకుండా పాటించాలి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వల్ల శరీరం నుండి ఎక్కువ శాతం నీరు బయటకు పోవడం,  కండరాల నొప్పులు,  అలసిపోవడం,  అకస్మాత్తుగా పడిపోవడం, వడ దెబ్బ బారిన పడటం వల్ల ఎక్కువగా రుగ్మతలు వచ్చే అవకాశాలు ఉంటాయి. వాటిలో భాగంగా పెదవులు ఎండిపోవడం, తలనొప్పి,వాంతులు, దాహం వేయటం, కండరాల వాపు లు, దద్దుర్లు, తిమ్మిర్లు రావడం, శరీరం చల్లబడటం, మూత్రం తక్కువ రావడం, రంగు మారటం మరియు మంట ఉండటం మరియు తొందరగా గుర్తించక పోతే కొన్నిసార్లు స్పర్శ కోల్పోవడం జరిగే అవకాశాలు  ఉంటాయి. ఇలాంటి లక్షణాలు కనబడితే డాక్టర్ను కలవడం గాని దాంతో పాటుగా ఎక్కువ గా నీళ్లు తాగటం  మరియు చల్లటి ప్రదేశంలో విశ్రాంతి తీసుకోవడం చేయాలి.

బాగా ఎండలో పని చేసినప్పుడు విశ్రాంతి లేకుండా,  నీళ్లు ఎక్కువ గా తాగకపోవడం వల్ల, వెలుతురు లేకుండా పని చేసినప్పుడు,  ఆహారం సరిగా తీసుకోనప్పుడు, heavy  equipment మీద పని చేసినప్పుడు, జ్వరం మరియు రక్తపోటు ఉన్నప్పుడు Heat stress బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటాయి.

ఎండ తీవ్రత దృశ్య ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి
1.  ఆయా దేశాలకు సంబంధించిన పని వేళలను పాటించటం
2. ఎక్కువగా నీరు తాగడం, మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవడం మరియు రాత్రిపూట సమయానికి నిద్ర పోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగే అవకాశం ఉంటుంది.
3. దీర్ఘకాల వ్యాధులు ఉన్న వారు తప్పకుండా సమయానికి మందులు వేసుకోవడం
4.  కోవిడ్-19 లో భాగంగా మిగతా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. వాటిలో ముఖ్యంగా తాజా కూరగాయలు, పండ్లు మరియు ఆకు కూరలు తీసుకోవటం.
5. పొగతాగటం తగ్గించడం గానీ మరియు మానేయటం, కొవ్వు పదార్ధాలు తక్కువగా తీసుకోవడం చేయాలి మరియు మద్యపానం ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో నీటి లభ్యత తగ్గి మూత్రపిండాల మరియు కాలేయం వ్యాధులు బారినపడే అవకాశాలు ఉంటాయి.
6. దుమ్ము ధూళికి దూరంగా ఉండటం మరియు మాస్క్ కట్టుకోవడం చేసుకోవాలి. జ్వరము, దగ్గు, జలుబు, కండరాల నొప్పులు కనబడితే తప్పకుండా దగ్గర్లో ఉన్న డాక్టర్ ను సంప్రదించాలి. 

ఈ విధంగా డాక్టర్ వెంకట్ రెడ్డి పల్నాటి యొక్క పలు సూచనలు పాటించడం వలన వేడి తీవ్రత కు  సంబంధించిన వ్యాధులను  అధిగమించడం మరియు ఇప్పుడు ఎదుర్కొంటున్న కొవిడ్ వైరస్ బారిన పడకుండా ఉండటం జరుగుతుంది.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com