ఖతార్:వదిలివేసిన వాహనాల తొలగింపుపై జాయింట్ కమిటీ సమీక్ష
- July 18, 2020
దోహా:ఖతార్ పారిశ్రామిక వాడలో ఇబ్బడిముబ్బడిగా వదిలివేసిన వాహనాలు స్థానిక పాలకులకు పెద్ద సమస్యగా మారాయి. రోడ్లపై వదిలివేసిన వాహనాల కారణంగా దొంగతనాల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో పాటు నగర ఇమేజ్ ను కూడా దెబ్బతీస్తున్నాయన్నది పాలకుల వాదన. నగర పరిశుభ్రతకు, సుందరీకరణకు ఈ పరిణామం అవరోధంగా మారుతోంది కూడా. దీంతో చాలాకాలంగా నిరుపయోగంగా రోడ్లపై ఉన్న వాహనాలను వాటి యజమానులు వెంటనే తొలగించాలని గతంలోనే అధికారులు సూచించారు. దీనికి సంబంధించి తీర్మానం 187, 2020 కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే..వాహనాల తొలగింపు చర్యల పురోగతిపై చర్చించేందుకు సమావేశమైన జాయింట్ కమిటీ..వాహనాల తొలగింపులో ఎదురవుతున్న అవరోధాలపై సమీక్షించారు. పబ్లిక్ క్లీన్నెస్ లా 18, 2017 చట్టాన్ని అమలు చేసి వాహనాలను తొలగించాలని జాయింట్ కమిటీ అధికారులకు సూచించింది. వీధులలో వదిలివేసిన వాహనాలకు సంబంధించి ఎదైనా సందేహాలు ఉంటే 33238885 నెంబర్ కు కాల్ చేయాలని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?