కువైట్:ఆరోగ్య భద్రతా ప్రమాణాలను పాటించని 185 షాపుల సీజ్

- July 18, 2020 , by Maagulf
కువైట్:ఆరోగ్య భద్రతా ప్రమాణాలను పాటించని 185 షాపుల సీజ్

కువైట్ సిటీ:కరోనా మహమ్మారి నేపథ్యంలో సరైన ఆరోగ్య భద్రత ప్రమాణాలు పాటించని 185 షాపులను సీజ్ చేశారు అధికారులు. లాక్ డౌన్ తర్వాత సాధారణ పరిస్థితుల పునరుద్ధరణలో భాగంగా పలు వ్యాపారాలకు అనుమతించిన కువైట్ మంత్రి మండలి..కరోనా వ్యాప్తి నియంత్రణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఆరోగ్య భద్రత ప్రమాణాలను సూచించిన విషయం తెలిసిందే. అయితే..మంత్రిమండలి నిర్ణయాన్ని వ్యాపారులు అమలు చేస్తున్నారో లేదో పరిశీలించేందుకు కువైట్ మున్సిపాలిటి పరిధిలో అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. దాదాపు 8230 చోట్ల తనిఖీలు నిర్వహించగా..1061 చోట్ల నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు. అందులో తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిన 185 షాపులను అధికారులు మూసివేశారు. కరోనా నియంత్రణకు మంత్రిమండలి సూచించినట్లుగా వ్యాపారులు తగిన జాగ్రత్తలు పాటించాలని కువైట్ మున్సిపాలిటీ అధికారులు కోరారు. విధిగా ఫేస్ మాస్క్ ధరించటంతో పాటు ఎప్పటికప్పుడు చేతులను శుభ్రపరుచుకోవాలని సూచించారు. అలాగే ఫ్లోర్ తో పాటు టాయిలెట్స్ లను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని వ్యాపారులను ఆదేశించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com