దుబాయ్:ఇకపై పబ్లిక్‌ హాలీడేస్‌, వీకెండ్స్‌లోనూ తెరిచే వుండనున్న ఇండియన్‌ కాన్సులేట్‌

- July 20, 2020 , by Maagulf
దుబాయ్:ఇకపై పబ్లిక్‌ హాలీడేస్‌, వీకెండ్స్‌లోనూ తెరిచే వుండనున్న ఇండియన్‌ కాన్సులేట్‌

దుబాయ్‌: ఆగస్ట్‌ 1 నుంచి దుబాయ్‌లోని కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా, వీకెండ్స్‌ అలాగే పబ్లిక్‌ హాలీడేస్‌లోనూ తెరిచే వుంటుందని కాన్సుల్‌ జనరల్‌ డాక్టర్‌ అమన్‌ పూరి చెప్పారు. జులై 19, ఆదివారం దుబాయ్‌లోని కాన్సులేట్‌ బాధ్యతలు స్వీకరించిన ఇండియన్‌ డిప్లమాట్‌, ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారాయన. ఆగస్ట్‌ 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సెలవు రోజుల్లోనూ కాన్సులేట్‌ తెరిచే వుంటుందని ఆయన పేర్కొన్నారు. అత్యసవర పరిస్థితుల్లో కాన్సుల్‌ సర్వీసులు ఈ రోజుల్లో కూడా అందుబాటులో వుంటాయి. రానున్న రోజుల్లో మరింత క్లిష్టమైన పరిస్థితులు వుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com