అంగారక గ్రహంపైకి యూఏఈ తొలి స్పేస్‌క్రాఫ్ట్
- July 20, 2020
యూఏఈ: రెడ్ ప్లానెట్ గుట్టుమట్లను ఆవిష్కరించేందుకు అంగారక గ్రహానికి తొలి అరబ్ స్పేస్ మిషన్ హోప్‌ను జపాన్ నుంచి ప్రయోగాత్మకంగా పరీక్షించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అభివృద్ధి చేసిన ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను సోమవారం ఉదయం జపాన్ రాకెట్ అంతరిక్షంలోకి విజయవంతంగా మోసుకెళ్లిందని అధికారులు తెలిపారు. అరబిక్‌లో అల్-అమల్‌గా పేరొందిన ఈ ప్రయోగం ప్రతికూల వాతావరణం కారణంగా రెండుసార్లు వాయిదా పడింది. ప్రయోగం జరిగిన గంటతర్వాత స్పేస్‌క్రాఫ్ట్ రాకెట్ నుంచి విడిపోయి నిర్ధేశిత కక్ష్యలోకి ప్రవేశించిందని రాకెట్ తయారీ సంస్థ మిట్సుబిషి హెవీ ఇండస్ర్టీస్ పేర్కొంది.
తమ స్పేస్‌మిషన్ యూఏఈ సహా ఈ ప్రాంతానికి కీలక మైలురాయి వంటిదని మహ్మద్ బిన్ రషీద్ స్సేస్ సెంటర్ డైరెక్టర్ హమద్ అషియబని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి హోప్ అంగారక గ్రహంపై అడుగుపెడుతుందని భావిస్తున్నారు. ‘హోప్’ పేరుతో ఓ ప్రోబ్‌ని వాతావరణ పరిస్థితుల్ని అధ్యయనం చేసేందుకు వీలుగా రూపొందించారు. ఓ కారు సైజ్‌లో ఈ స్పేస్ క్రాఫ్ట్ వుంటుంది. 2021 జనవరి - మార్చి మధ్యలో ఈ ప్రోబ్, మార్స్‌ని చేరుకోనుంది. ఈ మిషన్ సక్సెస్ అయితే, మొట్టమొదటి అరబ్ మిషన్‌గా దీనికి పేరు దక్కుతుంది.
అంగారక గ్రహంపైకి తొలి స్పేస్‌క్రాఫ్ట్‌ను పంపడంపై యూఏఈ ప్రభుత్వం ట్విటర్‌లో స్పందిస్తూ ఇది అరబ్ ప్రాంతానికి గర్వకారణంతో పాటు సరికొత్త ఆశలు చిగురింపచేసేదని వ్యాఖ్యానించింది. హోప్ మిషన్ ప్లానెట్‌పై ప్రత్యేక అంశాలను ఆవిష్కరిస్తుందని మిషన్ ప్రాజెక్ట్ మేనేజర్ ఒమ్రన్ షరాఫ్ ఆశాభావం వ్యక్తం చేశారు. 2021 సెప్టెంబర్‌లో హోప్ మిషన్ భూమండలానికి సమాచారాన్ని చేరవేస్తుందని, ఈ సమాచారం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలకు అథ్యయనం కోసం అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్‌లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!







