లైసెన్స్‌ లేకుండా ఆయిల్‌ ఉత్పత్తుల విక్రయం: నలుగురి అరెస్ట్‌

- July 20, 2020 , by Maagulf
లైసెన్స్‌ లేకుండా ఆయిల్‌ ఉత్పత్తుల విక్రయం: నలుగురి అరెస్ట్‌

మనామా:నలుగురు వ్యక్తులు, ఆయిల్‌ ఉత్పత్తుల్ని ఎలాంటి లైసెన్స్‌ లేకుండా విక్రయిస్తున్న కారణంగా అరెస్ట్‌ చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ ఈ విషయాన్ని ధృవీకరించింది. క్యాపిటల్‌ గవర్నరేట్‌ పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఈ అరెస్టుల్ని రిపోర్ట్‌ చేసినట్లు పేర్కొన్నారు. ఓ కేసులో ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్‌ చేయడం జరిగిందనీ, సిట్రాలోని ఓ ఫామ్ హౌస్‌లో డీజిల్‌ని విక్రయించేందుకు నిందితులు యత్నించారనీ అధికారులు వివరించారు. మరో ఇద్దరు వ్యక్తుల్ని తమ వాహనాల నుంచి డీజిల్‌ని అక్రమంగా విక్రయిస్తున్నట్లు గుర్తించి అరెస్ట్‌ చేసినట్లు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com