చిన్నారుల వ్యాక్సిన్‌ని వ్యతిరేకిస్తే, తల్లిదండ్రులకు శిక్ష
- July 21, 2020
కువైట్ సిటీ:మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ - చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ కార్యాలయం హెడ్ డాక్టర్ మోనా అల్ ఖ్వారి మాట్లాడుతూ, తమ పిల్లలకు వ్యాక్సినేషన్ వేయించడాన్ని నిరాకరించిన పేరెంట్స్‌కి క్రిమినల్ పనిష్‌మెంట్ తప్పదని హెచ్చరించారు. ఈ మేరకు స్పష్టమైన ఇన్‌స్ట్రక్షన్స్ సంబంధిత మెడికల్ అథారిటీస్‌కి జారీ చేశారు. పిల్లలకు వ్యాక్సినేషన్ చేయించడం తల్లిదండ్రుల బాధ్యత అని డాక్టర్ మోనా చెప్పారు. చైల్డ్ ప్రొటెక్షన్ చట్టం 2015/ 2015 ఆర్టికల్ 83 ప్రకారం ఆరు నెలలకు మించకుండా జైలు శిక్ష, 1000 దినార్స్‌కి మించకుండా జరీమానా ఉల్లంఘనులకు విధించడం జరుగుతుందని చెప్పారు. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు వ్యాక్సినేషన్ వేయించకుండా వుంటున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చిందని ఆమె వివరించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?