రాజ్యసభలో సమావేశాలు లేకుండా ప్రమాణస్వీకారాలు..

- July 22, 2020 , by Maagulf
రాజ్యసభలో సమావేశాలు లేకుండా ప్రమాణస్వీకారాలు..

న్యూ ఢిల్లీ:ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు బుధవారం ప్రమాణస్వీకారం చేస్తున్నారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు మొత్తం 61మంది సభ్యులతో ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలు జరగకుండా ప్రమాణస్వీకారోత్సవం జరగడం రాజ్యసభ చరిత్రలో ఇదే మొదటిసారి. అయితే, దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో 15 మంది కొత్త సభ్యులు హాజరుకాలేదు. టీఆర్ఎస్ సభ్యులు కేశవరావు, కేఆర్ సురేష్ రెడ్డి వర్షాకాల సమావేశాల సమయంలో ప్రమాణం చేయాలని వారిద్దరూ నిర్ణయించుకున్నారు.

అటు, కర్నాటకలో పెద్దల సభకు వెళ్తున్న మాజీ ప్రధాని దేవెగౌడ్, తమిళనాడు నుంచి డీఎంకే సభ్యుడు తిరుచ్చి శివ కూడా బుధవారం ప్రమాణస్వీకారం చెయ్యలేదు. తృణముల్ కాంగ్రెస్ సభ్యులు కూడా హాజరుకావడంలేదని వెంకయ్యనాయుడుకి లేఖ రాశారు.ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకట రమణారావు తెలుగులో ప్రమాణం చేశారు.
అనంతరం ఇతర రాష్ట్రాల నుంచి ఎన్నికైన సభ్యులతో రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com