అబుధాబి:డ్రగ్స్ ప్రమోట్ చేస్తే సహించేదిలేదు..ఫెడరల్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ వార్నింగ్
- July 22, 2020
అబుధాబి:యువత భవిష్యత్తును నాశనం చేయటంతో పాటు సమాజ భద్రతకు హనికరంగా మారుతున్న మాదకద్రవ్యాలను ప్రమోట్ చేసే ఎలాంటి చర్యలను తాము ఉపేక్షించబోమని ఫెడరల్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. సోషల్ మీడియా వేదికగా కొందరు డ్రగ్స్ అమ్మకాలను ప్రమోట్ చేస్తున్న నేపథ్యంలో ఈ హెచ్చరికలు జారీ చేసింది. యూఏఈ చట్టాల మేరకు ఫెడరల్ లా 1995లోని 14 అధికరణ ప్రకారం మాదకద్రవ్యాల కేసులో పట్టుబడితే మరణశిక్ష పడుతుందని వార్నింగ్ ఇచ్చింది. ఇక ఫెడరల్ లా 2012లోని 5వ అధికరణ ప్రకారం మాదకద్రవ్యాలను సోషల్ మీడియాలోగానీ, ఐటీకి సంబంధించి ఏ విధంగానూ ప్రచారం చేయటానికి వీల్లేదు. అధికరణ 36 ప్రకారం డ్రగ్స్ అమ్మకాలు పెంచుకునే ఉద్దేశంతో కంప్యూటర్ నెట్వర్క్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా ప్రచారం కల్పించినా శిక్షార్హులు అవుతారని వెల్లడించింది. డ్రగ్స్ అమ్మకాలను ప్రొత్సహించేలా చేపట్టే చర్యలకు 5 లక్షల దిర్హామ్ ల నుంచి పది లక్షల దిర్హామ్ ల వరకు జరిమానాతో పాటు జైలు శిక్షను ఎదుర్కొవాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!