మే 29న పండగ చేసుకుందాం అంటున్న రామ్...

- May 24, 2015 , by Maagulf
మే 29న పండగ చేసుకుందాం అంటున్న రామ్...

రామ్ , రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సోనాల్‌ చౌహాన్‌ జంటగా రాబోతున్న చిత్రం 'పండగ చేస్కో'. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహించగా , పరుచూరి కిరీటి నిర్మాత. తాజాగా చిత్ర రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు చిత్ర నిర్మాత. ఈ నెల 29 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎప్పుడో ఆడియో లంచ్ జరుపుకున్న ఈ చిత్రం డబ్బింగ్ కార్య క్రమాలు లేట్ కావడం తో చిత్ర విడుదల ఆలస్యం అయ్యింది. తమన్ అందించిన మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోవడం లో విఫలం అయ్యింది. పూర్తి ఫ్యామిలీ చిత్రంగా రాబోతున్న ఈ సినిమా రామ్ కు పెద్ద హిట్ అవుతుందని చిత్ర యూనిట్ గట్టి నమ్మకం తో ఉన్నారు. ఈ మద్య రామ్ వరుస ఫ్లాప్స్ తో సతమవుతున్న సంగతి తెల్సిందే.. ఎలాయిన ఈ చిత్రం సక్సెస్ అయి రామ్ కు మళ్లీ బ్రేక్ ఇవ్వాలని కోరుకుందాం.. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com