నివాసితులందరికీ ఉచిత కోవిడ్‌-19 పరీక్షలు

- July 23, 2020 , by Maagulf
నివాసితులందరికీ ఉచిత కోవిడ్‌-19 పరీక్షలు

అజ్మన్:అజ్మన్‌ నివాసితులు కరోనా వైరస్‌ (కోవిడ్‌ 19) పరీక్షల్ని జులై 23 నుంచి ప్రత్యేక కేంద్రం వద్ద చేయించుకోవడానికి వీలు కల్పిస్తున్నారు. అల్‌ బయిత్‌ మెతవ్వాహిద్‌ హాల్‌లో రోజుకి 2,000 మందికి ఈ పరీక్షల్ని నిర్వహిస్తారు. అజ్మన్‌ మెడికల్‌ జోన్‌ డైరెక్టర్‌ హమాద్‌ తారిం అల్‌ షామ్సి మాట్లాడుతూ, అన్ని ప్రాంతాలవారికీ అందుబాటులో వుండేలా ఈ కేంద్రాన్ని నిర్ణయించినట్లు చెప్పారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇది తెరచి వుంటుంది. ఉచితంగా ఎక్కువమందికి పరీక్షలు చేయడంలో అబుధాబి, షార్జాలను అజ్మన్‌ అనుసరిస్తోంది. టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ట్రీట్‌మెంట్‌ విషయంలో యూఏఈ ఆదర్శంగా నిలుస్తోంది. యూఏఈలో ఇప్పటికే 4.5 మిలియన్‌ కరోనా టెస్టులు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com