తిరిగి తెరిచిన తరువాత పాఠశాలలో ఎవరైనా కరోనా పాజిటివ్ పరీక్షించినట్లయితే ఏమి చేయాలి?

- July 23, 2020 , by Maagulf
తిరిగి తెరిచిన తరువాత పాఠశాలలో ఎవరైనా కరోనా పాజిటివ్ పరీక్షించినట్లయితే ఏమి చేయాలి?

యూఏఈ: యూఏఈ లో వేసవి విరామం తరువాత పాఠశాలలు మరియు విశ్వవిద్యాలయాలు పునః ప్రారంభానికి సిద్ధమవుతుండగా, క్యాంపస్ లో కరోనా కేసు కనుగొనబడితే అనుసరించాల్సిన ప్రోటోకాల్‌ను వివరిస్తూ విద్యా మంత్రిత్వ శాఖ (ఎంఓఇ) ఇటీవల ఒక పత్రాన్ని విడుదల చేసింది. దానిలోని కొన్ని ముఖ్య అంశాలు ఇలా ఉన్నాయి:

పాఠశాలలో ఎవరైనా కరోనా పాజిటివ్ పరీక్షించినట్లయితే ఏమి జరుగుతుంది?
* ఆరోగ్య అధికారం యొక్క భద్రతా ప్రోటోకాల్‌లను తప్పనిసరిగా అమలు చేస్తూ సదరు వ్యక్తి క్వారంటైన్ అవ్వాలి.
* ఆ వ్యక్తితో సంబంధం ఉన్న వ్యక్తులందరినీ గుర్తించాలి.
* ఆ వ్యక్తి సందర్శించిన తరగతి గదులు/ఇతర ప్రాంతాలను క్రిమిసంహారకం చేయాలి.

ట్రేసింగ్ మరియు క్వారంటైన్:
* ఉపాధ్యాయులలో ఒకరికి వ్యాధి సోకినట్లయితే, అతను / ఆమెతో సంబంధం ఉన్న ఉపాధ్యాయులు మరియు విద్యార్థులందరినీ పరీక్షించి స్వీయ నిర్బంధంలో ఉంచాలి.
* సిబ్బందిలో ఒకరికి సోకినట్లయితే, వ్యక్తిని స్వీయ నిర్బంధంలో ఉంచటమేకాకుండా అతను / ఆమెతో సంబంధం కలిగి ఉన్న ఇతర సిబ్బంది అందరూ పరీక్షింపబడాలి.
* ఒక విద్యార్థి సోకినట్లయితే, ఆరోగ్య అధికారం యొక్క ఆదేశాలతో స్వీయ నిర్బంధాన్ని చేయించాలి. అదనంగా, అతను / ఆమెతో సంబంధం ఉన్న విద్యార్థులు మరియు ఉపాధ్యాయులందరికీ తప్పనిసరిగా పరీక్షలు జరపాలి.

ఒకటి కంటే ఎక్కువ ఉపాధ్యాయులు లేదా విద్యార్థి సోకినట్లయితే ...
* ఆన్-క్యాంపస్ తరగతులు తప్పనిసరిగా నిలిపివేయబడతాయి. 14 రోజుల పాటు దూరవిద్య అమలు చేయబడుతుంది.
* విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు సిబ్బంది అందరూ 14 రోజుల నిర్బంధంలో ఉండాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com