పంద్రాగస్టు వేడుకలకు కేంద్రం మార్గదర్శకాలు

- July 23, 2020 , by Maagulf
పంద్రాగస్టు వేడుకలకు కేంద్రం మార్గదర్శకాలు

న్యూఢిల్లీ: ఆగస్టు 15 వేడుకల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల రాజధానుల్లో ఉదయం 9 గంటలకు వేడుకలు నిర్వహించాలని పేర్కొంది. సిఎంలు జెండా వందనం చేస్తారని, పోలీస్, ఆర్మీ, పారామిలటరీ, ఎన్ సిసి దళాలు మార్చ్ ఫాస్ట్ చేయాలని సూచించింది. వేడుకల్లో భాగంగా మాస్క్ లు ధరించాలని స్పష్టం చేసింది. కరోనా దృష్ట్యా ప్రజలు వేడుకల్లో పాల్గొనకుండా, వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. కరోనా సేవలందించిన వారిని, వైరస్ నుంచి కోలుకున్నవారిని ప్రత్యేక ఆహ్వానితులుగా వేడుకలకు పిలువాలని కేంద్రం పేర్కొంది. ఇదే తరహాలో జిల్లా, మండల, పంచాయతీ స్థాయిలోనూ వేడుకలు నిర్వహించాలని స్పష్టం చేసింది. రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించే విషయం గవర్నర్లే నిర్ణయం తీసుకోవాలని తేల్చి చెప్పింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com