ఎల్లిపోతావురా మనిషి అంటూ అందమైన పాట తో స్వాతి రెడ్డి
- July 24, 2020
సప్త సముద్రాలూ ధాటి పర దేశ సంప్రదాయాల తో బ్రతుకుతున్న మన భారత దేశ సంప్రదాయాలు ఎప్పటికి మర్చిపోలేదు గాయని స్వాతి రెడ్డి. ప్రతిరోజూ అంగ్లం లో మాట్లాడుతున్న మన తెలుగు భాషను ఎన్నడూ మర్చిపోలేదు గాయని స్వాతి రెడ్డి. ఎన్నో అద్భుతమైన తెలుగు భాణీలతో స్వష్టమైన తెలుగు మాటలతో మన తెలుగు వాళ్ళని ఎపుడు అలరిస్తూనే ఉంది గాయని స్వాతి రెడ్డి. ఇప్పుడు మరొక అద్భుతమైన పాటతో మన ముందుకు వచ్చింది.
"ఎల్లిపోతావురా మనిషి ఏదో ఓ నాడు ఈ భూమి వదిలేసి..... ఉండాలి రా కలిసిమెలిసి అర్రే ఉన్నన్నాళ్లు కొత్త తెలిసి" అంటూ మనసుకు హద్దుకునే పాటతో మనముందుకి వచ్చింది. ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన మన భారత మాత తన బిడ్దలను కాచి కాపాడుతుంది. అలానే మనిషి పుట్టుక పుట్టిన మనం కష్ట కాలం అయినా కలిసి మెలిసి ఉండాలి అనే చెప్పే గొప్ప పాట ఇది. మానవత్వం మరిచి మనస్సాక్షి ని విడిచి స్వార్ధం, ద్వేషం తో బ్రతుకుతున్న మనుషుల గురించి చెప్తూ , ఈ జీవం కొన్నాల్లే, ఉన్నన్నాళ్ళు అందరితో కలిసి ఉండమని జీవిత పరమార్ధం తెలియజేస్తున్న పాట. ఇది పాట కాదు మేము మనుషులం అని ముసుగు వేసుకుని నటిస్తున్న మన అందరి ఆట
ఈ పాటకి భీమ్స్ సిసిరోలియో సంగీతం సాహిత్యం అందించగా లండన్ లో ఉంటున్న స్వాతి రెడ్డి గానం చేసారు. ఈ పాట చిత్రీకరణ అంత లండన్ లోనే జరిగింది. నాగోల్ బాల్ రెడ్డి మరియు లొంక నరేందర్ రెడ్డి ఈ పాటను నిర్మించారు. ఈ పాటని మన తెలుగు వారందరికీ అంకితం ఇస్తున్నారు.
లిరిక్ & మ్యూజిక్ - భీమ్స్ సిసిరోలియో
సింగర్ - స్వాతి రెడ్డి
ఆలప్ - ఫైజాన్ ఖాన్
ఎడిటర్ - శివ వై ప్రసాద్
కెమెరా - ఏం వి ప్రసాద్
నిర్మాత - నాగోల్ బాల్ రెడ్డి మరియు లొంక నరేందర్ రెడ్డి
మ్యూజిక్ కోఆర్డీనేటర్ - మాల్యా కందుకూరి
మిక్సింగ్ - ఎస్. కిశోర్ కుమార్
మస్టర్డ్ - ఆర్టిఫ్లెక్ స్టూడియో సిడ్నీ
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







