గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. ఒక్కరోజే లక్ష మొక్కలు
- July 26, 2020
హైదరాబాద్:టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంతో ప్రాచుర్యం పొందుతోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే ఎందరో సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఈ ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారు. అలాగే తమ స్నేహితులను కూడా నామినేట్ చేస్తున్నారు. దీంతో ఈ కార్యక్రమం అంచలంచలుగా పెరుగుతోంది. నెటిజన్లు కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. మొక్కలు నాటిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఎంపీ సంతోష్ కుమార్ ను ట్యాగ్ చేస్తున్నారు.
తాజాగా ఈరోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబిలీహిల్స్ కో ఆపరేటివ్ హౌజ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ అండ్ జూబిలీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ల ఆధ్వర్యంలో జూబిలీహిల్స్ క్లబ్ ప్రాంగణంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ సంతోష్ కుమార్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, సినీ దర్శకులు బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడిలు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







