అబుధాబిలో కేరళ దంపతుల అనుమానాస్పద మృతి
- July 26, 2020
అబుధాబి:అబుధాబిలోని ఓ ఫ్లాట్‌లో భారత్‌కు చెందిన దంపతులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ విషయాన్నీ మీడియా నివేదికలు తెలిపాయి. కేరళలోని కోజికోడ్ జిల్లాకు చెందిన జనార్థనన్ పట్టీరీ (57), మినిజ (52) దాదాపు 18 సంవత్సరాలుగా అబుధాబిలో నివసిస్తున్నారు. ట్రావెల్ ఏజెన్సీలో పనిచేసిన పట్టీరీ ఇటీవల ఉద్యోగం కోల్పోయాడు. మినిజా చార్టర్డ్ అకౌంటెంట్ గా ఉన్నారు.అయితే వారు ఎలా చనిపోయారని విషయం మాత్రం ఇంకా తేలలేదు.ఈ జంట అబుధాబిలో ఒంటరిగా నివసించినట్లు కేరళ సోషల్ సెంటర్ అధ్యక్షుడు కృష్ణ కుమార్ వి.పి తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి వారి సన్నిహితుడు ఒకరు మాట్లాడుతూ.. జనార్థనన్, మినిజ చాలా మంచివారని. వారికి ఎవరితోనూ ఎటువంటి సమస్య లేదని అన్నారు. జనార్ధనన్ తన ఉద్యోగం కోల్పోవడంతో కొద్ది రోజుల క్రితమే తన కారును కూడా అమ్మేశాడని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







