యూఏఈ నుంచి భారత్‌కు 105 వందే భారత్ మిషన్ ప్రత్యేక విమానాలు

- July 27, 2020 , by Maagulf
యూఏఈ నుంచి భారత్‌కు 105 వందే భారత్ మిషన్ ప్రత్యేక విమానాలు

యూ.ఏ.ఈ: కోవిడ్-19 మహమ్మారి  కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ఇండియాకు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది.ఆగస్ట్ 1 నుంచి ‘వందే భారత్ మిషన్’ యొక్క 5వ విడతను ప్రారంభించనున్నట్లు భారత పౌర విమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి
ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా.. 5వ విడత వందే భారత్ మిషన్‌లో భాగంగా భారత్-యూఏఈల మధ్య 105 రీపాట్రియేషన్ విమానాలను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఆగస్ట్ 1-15 మధ్య షార్జా, దుబాయ్ నుంచి భారతదేశంలోని వివిధ నగరాలకు 74 విమానాలు నడుస్తాయని నీరజ్ అగర్వాల్(కాన్సుల్ ప్రెస్, ఇన్ఫర్మేషన్, అండ్ కల్చర్)తెలిపారు. ఇదే సమయంలో అబుధాబి నుంచి భారత్‌కు 31 ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయనున్నట్లు యూఏఈలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. కాగా.. విమాన టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్ సమాచారాన్ని త్వరలో వెల్లడించనున్నట్లు నీరజ్ అగర్వాల్ చెప్పారు. ఇదిలా ఉంటే..యూఏఈలో చిక్కుకున్న భారతీయులను ఇండియాకు, ఇక్కడ చిక్కుకున్న యూఏఈ రెసిడెన్స్‌ను యూఏఈకి తరలించే విషయంలో ఇరు దేశాల మధ్య కుదిరన ఒప్పందం గడువు నిన్నటితో ముగిసింది. ఈ విషయంపై నీరజ్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఇరు దేశాలు ఈ ఒప్పందాన్ని కొనసాగించే అవకాశం ఉందన్నారు. త్వరలోనే దీనిపై స్పష్టత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.యూ.ఏ.ఈ మరియు ఇండియన్ క్యారియర్‌లతో పాటు ప్రైవేట్ క్యారియర్‌ల నుండి తగినంత విమానాలు అందుబాటులో ఉన్నందున భారతదేశానికి తిరిగి వెళ్లాలని కోరుకునే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.యూ.ఏ.ఈకి తిరిగి రావాలనుకునే ప్రయాణీకులకు కూడా ఇదే చెప్పవచ్చన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com