ట్రావెలర్ల సహాయం కోసం విమానాశ్రయంలో కొత్త యాప్
- July 27, 2020
కువైట్ సిటీ:కువైట్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA), కొత్త అప్లికేషన్‌ని ప్రయాణీకులకు సాయపడేందుకోసం ఏర్పాటు చేసింది. వచ్చే నెల నుంచి కమర్షియల్ విమానాల రాకపోకలు ప్రారంభం కానున్న దరిమిలా ఈ యాప్ ప్రయాణీకులకు ఎంతగానో ఉపయోగపడనుంది. డిజిసిఎ, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆమోదించిన గైడ్‌లైన్స్‌కి అనుగుణంగా ఈ అప్లికేషన్ పనిచేస్తుంది. కోవిడ్19 ప్రికాషన్స్‌ని అమలు చేస్తూ, ప్రయాణీకులకు వచ్చే నెల నుంచి కువైట్ విమానాశ్రయాలు సౌకర్యాలు అందించనున్నాయి. కాగా, ప్రయాణీకుల ఆరోగ్యం, ఎయిర్‌పోర్టు సిబ్బంది ఆరోగ్యం అలాగే సేఫ్టీ ప్రొసిడ్యూర్స్ పట్ల అవగాహన పెంచడం అనే మూడు ఉద్దేశ్యాలతో ప్రత్యేకంగా యాప్‌ని రూపొందించారు. ప్రయాణీకులంతా ఇంగ్లీషు మరియు అరబిక్‌లలో లభ్యమయ్యే యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి వుంటుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







