యూ.ఏ.ఈ:కరోనా రోగులను గులాబీలు,గెట్-వెల్ కార్డులతో ఆశ్చర్యపరిచిన పోలీస్

- July 27, 2020 , by Maagulf
యూ.ఏ.ఈ:కరోనా రోగులను గులాబీలు,గెట్-వెల్ కార్డులతో ఆశ్చర్యపరిచిన పోలీస్

అజ్మన్:కరోనా నుంచి యూఏఈ క్రమంగా కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో కరోనా బారినపడిన వారికి అజ్మన్ పోలీసులు సర్‌ప్రైజ్ ఇచ్చారు.కరోనా సోకడంతో ఆస్పత్రిలో చేరి, చికిత్స తీసుకుంటున్న వారికి గులాబీ పూలు, స్వీట్లు, గిఫ్ట్ కార్డు‌లు ఇచ్చి ఆశ్చర్యపర్చారు. కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు.. బాధితులకు ఇచ్చిన గిఫ్ట్ కార్డుల్లో అజ్మన్ పోలీసులు పేర్కొన్నారు. కేవలం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికే కాకుండా.. కరోనాని జయించిన వారికి, క్వారెంటైన్ సెంటర్లలో ఉంటున్న వారికి కూడా పోలీసులు వీటిని పంచారు. ఈ సందర్భంగా అజ్మన్ పోలీసు ఉన్నతాధికారులు స్పందిస్తూ.. ఎమిరేట్స్ నివాసితుల క్షేమం కోసం తాము చూపుతున్న శ్రద్ధను తెలియజేసేందుకే ఈ పని చేసినట్లు వెల్లడించారు. శాంతిభద్రతల పరిరక్షణతోపాటు, ప్రజల శ్రేయస్సు కూడా తమకు ముఖ్యమే అన్నారు.పోలీసు మీడియా మరియు పబ్లిక్ రిలేషన్స్ బృందం పాల్గొని అన్ని సమన్వయ బాధ్యతలను చేపట్టింది, ఈ చొరవ చికిత్స పొందుతున్న రోగులకు మరియు కరోనా నుండి కోలుకునేవారికి చేరుతుందని ఉన్నతాధికారులు తెలిపారు.ఇదిలా ఉంటే.. పోలీసుల నుంచి సర్‌ప్రైజ్ గిఫ్ట్‌ను అందుకున్న కరోనా బాధితులు.. వారికి కృతజ్ఞతలు తెలిపారు. మరికొందరు సోషల్ మీడియాలో పోలీసులపై ప్రశంసలు కురిపించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com