భారత్ లో 47 చైనా యాప్స్ బ్యాన్..

- July 27, 2020 , by Maagulf
భారత్ లో 47 చైనా యాప్స్ బ్యాన్..

న్యూ ఢిల్లీ:చైనాకు భారత్ మరో షాకిచ్చింది. ఇప్పటికే టిక్‌టాక్, హెలో సహా 59 చైనా యాప్స్‌ని భారత ప్రభుత్వం నిషేధించిన భారత్ ఇప్పుడు మరో 47యాప్స్ బ్యాన్ చేసింది. పబ్జీ, లూడో కింగ్ లాంటి 47 యాప్స్ ను బ్యాన్ చేసినట్టు చెబుతున్నారు. ఇంతకు ముందు నిషేధించిన 59 యాప్‌ లకు క్లోన్‌ లుగా ఈ 47 పనిచేస్తున్నాయని ఇండియా గుర్తించినట్టు చెబుతున్నారు, భారత ప్రభుత్వం తాజాగా నిషేధించిన 47 చైనా యాప్ ల జాబితా త్వరలో విడుదల కానుంది. అయితే ఇందులో పాపులర్ గేమింగ్ యాప్స్ అయిన పబ్‌జీ మొబైల్, లూడో వాల్డ్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అలీ ఎక్స్‌ప్రెస్ లాంటివి ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గాల్వాన్ లోయలో చైనా సైన్యం జరిపిన దాడిలో 20 మంది భారత సైనికులు అమరవీరులైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత యాంటీ చైనా సెంటిమెంట్ భారతదేశంలో పెరిగింది. చైనా వస్తువులు, యాప్స్, స్మార్ట్‌ఫోన్లు నిషేధించాలన్న డిమాండ్లు వచ్చాయి. అదీ కాక ఇన్ఫర్మేషన్ లీక్ అవుతోందని గుర్తించిన భారత నిఘా వర్గాలు ప్రభుత్వాన్ని హెచ్చరించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం చైనా మూలాలున్న 59 యాప్స్‌ని నిషేధించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com