కరోనా నెగటివ్..హాస్పిటల్ నుంచి ఐశ్వర్యరాయ్, ఆరాధ్య డిశ్ఛార్జ్
- July 27, 2020
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ బచ్చన్, ఆమె కూతురు ఆరాధ్య బచ్చన్ సోమవారం మధ్యాహ్నం తమ నివాసానికి క్షేమంగా చేరుకున్నారు. కరోనా నుంచి కోలుకున్న ఈ తల్లీకూతురు ముంబైలోని నానావతి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి తమ జల్సా భవనానికి వెళ్లారు. కోవిడ్19 రిపోర్టులు పరిశీలించిన నానావతి హాస్పిటల్ డాక్టర్లు సోమవారం మధ్యాహ్నం వీరిని డిశ్ఛార్జ్ చేసినట్లు తెలుస్తోంది.
రెండు వారాల కిందట బిగ్ బి అమితాబ్‌తో పాటు అభిషేక్ వచ్చన్, ఐశ్వర్యరాయ్, ఆరాధ్యలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. జులై 11న అమితాబ్, అభిషేక్‌లకు కరోనా పాజిటివ్‌గా తేలగా.. మరుసటి రోజు వచ్చిన కోవిడ్19 ఫలితాలలో జయాబచ్చన్‌కు నెగటివ్, ఐశ్వర్య, ఆరాధ్యలకు పాజిటివ్‌గా నిర్ధారించారు. కొన్ని రోజులు ఇంట్లో హోం క్వారంటైన్లో ఉన్న ఐష్, ఆరాధ్యలకు లక్షణాలు ఎక్కువు అవుతున్న నేపథ్యంలో వారం కిందట అదే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







