దుబాయ్: ఇండియన్ కాన్సులేట్ పనివేళలు
- July 27, 2020
దుబాయ్: ఆగస్ట్ 1 నుంచి దుబాయ్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, వీకెండ్స్ అలాగే పబ్లిక్ హాలీడేస్‌లోనూ తెరిచే వుంటుందని కాన్సుల్ జనరల్ డాక్టర్ అమన్ పూరి చెప్పారు. జులై 19, ఆదివారం దుబాయ్‌లోని కాన్సులేట్ బాధ్యతలు స్వీకరించిన ఇండియన్ డిప్లమాట్, ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారాయన. ఆగస్ట్ 1 నుంచి డిసెంబర్ 31, 2020 వరకు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సెలవు రోజుల్లోనూ కాన్సులేట్ తెరిచే వుంటుందని ఆయన పేర్కొన్నారు. అత్యసవర పరిస్థితుల్లో కాన్సుల్ సర్వీసులు ఈ రోజుల్లో కూడా అందుబాటులో వుంటాయి. రానున్న రోజుల్లో మరింత క్లిష్టమైన పరిస్థితులు వుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎమర్జెన్సీ కై అనగా పాస్‌పోర్ట్, ఇమేజ్ర్న్సీ పత్రాలు, వీసాలకై కాన్సులేట్ కి వచ్చేవారు 24*7 హెల్ప్ లైన్ నుంబర్లకు కాల్ చేసి రావలసిందిగా తద్వారా పనులు ఆలస్యమవ్వకుండా సాఫీగా జరిగేందుకు దోహదపడుతుందని సూచించారు అమన్ పూరి.
పాస్‌పోర్ట్ రెన్యువల్ కు https://embassy.passportindia.gov.in/ లోని ఆన్లైన్ దరఖాస్తును నింపాలి.
ఎమెజెన్సీ నంబర్లు:
056 – 5463903 (24*7)
054 – 3090575 / 054 – 3090571 / 054 – 3090572 (ఉ 8 గం.ల నుండి రా 8 గం.ల వరకు..అన్ని రోజులు పనిచేయబడును)
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







