సౌదీ:రీ-ఎంట్రీ వీసాల ఆటోమేటిక్‌ ఎక్స్‌టెన్షన్‌ని పూర్తి చేసిన జవాజత్‌

- July 28, 2020 , by Maagulf
సౌదీ:రీ-ఎంట్రీ వీసాల ఆటోమేటిక్‌ ఎక్స్‌టెన్షన్‌ని పూర్తి చేసిన జవాజత్‌

రియాద్‌:వలసదారుల రీ-ఎంట్రీ వీసాల ఆటోమేటిక్‌ పొడిగింపుని జవాజత్‌ (డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ పాస్‌పోర్ట్స్‌) పూర్తి చేసింది. దేశం వెలుపల చిక్కుకుపోయినవారి రీ-ఎంట్రీ అలాగే ఎగ్జిట్‌కి సంబంధించి మూడు నెలల పొడిగింపుని ఎలాంటి అదనపు రుసుము లేకుండా చేపట్టారు. ఈ మేరకు జవాజత్‌ ట్విట్టర్‌ ద్వారా ప్రకటించింది. డొమెస్టిక్‌ వర్కర్స్‌ తాలూకు కుటుంబ సభ్యులకు కూడా ఈ ఎక్స్‌టెన్షన్‌ వర్తిస్తుందని మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ - అబ్షెర్‌ యాప్‌ వెల్లడించింది. కాగా, సదరు వ్యక్తి తాలూకు రెసిడెన్సీ పర్మిట్‌, ఎక్స్‌టెన్షన్‌ పీరియడ్‌కి లోబడి వుండాలి. ఎగ్జిట్‌ రియు రీ-ఎంట్రీ వీసా గడవు 60 రోజులు మించి వుండకూడదు. ప్రతి అదనపు నెల పొడిగింపుకోసం ఒక్కో వీసాకి 100 సౌదీ రియాల్స్‌ చెల్లించాల్సి వుంటుంది. మల్టిపుల్‌ వీసాలకు ప్రతి నెలకు 200 సౌదీ రియాల్స్‌ చెల్లించాల్సి వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com