మలేషియా మాజీ ప్రధానికి ప్రధానికి 12 ఏళ్ళ జైలు శిక్ష

- July 28, 2020 , by Maagulf
మలేషియా మాజీ ప్రధానికి ప్రధానికి 12 ఏళ్ళ జైలు శిక్ష

మలేషియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్ కు అవినీతి కేసులో కౌలాలంపూర్ లోని హైకోర్టు 12 ఏళ్ళ జైలుశిక్ష విధించింది. లక్షలాది డాలర్ల స్కామ్ లో ఆయనను దోషిగా నిర్ధారించింది. రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ఆయన అవినీతి చిట్టా బయటపడడంతో అధికారాన్ని కోల్పోయారు. మలేసియాలో ఓ మాజీ ప్రధానిని దోషిగా కోర్టు నిర్ధారించడం ఇదే మొదటిసారి. అధికార దుర్వినియోగానికి, మనీ లాండరింగ్ఫ్ కి, విశ్వాసోల్లంఘనకు పాల్పడ్డారని నజీబ్ పై అభియోగాలున్నాయి. తమ దేశంలో ఎన్ ఆర్ సి ఇంటర్నేషనల్ సంస్థ నుంచి 9.8 మిలియన్ డాలర్లను, అలాగే తన హయాంలో 4 నుంచి 5 బిలియన్ డాలర్లను తన వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి ఆయన మళ్లించుకున్నారని కూడా ఆరోపణలు వచ్చాయి. తన ప్రధాని హోదాను అడ్డుపెట్టుకుని పెద్ద మొత్తంలో దేశ ఖజానానుంచి సొమ్మును అక్రమంగా సంపాదించాడట.. ఈ ఆరోపణలను పురస్కరించుకుని మహమ్మద్ నజ్లాన్ గజాలీ అనే న్యాయమూర్తి ఆయనకు ఏకకాలంలో మూడు శిక్షలు..మొతం 12 ఏళ్ళ జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.

మలేషియా లో అవినీతిపరులు, ఇతర నేరస్థులకు జైలుశిక్షలతో బాటు కొరడా దెబ్బల శిక్షలు కూడా విధిస్తారు. అయితే నజీబ్ 67 ఏళ్ళ వయస్సు వాడైనందున ఆయనను ఈ శిక్షల నుంచి మినహాయించారు.కాగా-తమ నేతకు ఇన్నేళ్ల జైలు శిక్షఅని ప్రకటించగానే కోర్టు బయట ఉన్న నజీబ్ వందలాది అభిమానులు విలపించారు. ఇది రాజకీయ కక్ష అని ఆరోపించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com