జీహెచ్‌ఎంసీ ఓట్ల లెక్కింపు ప్రారంభం..
- February 05, 2016
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. గ్రేటర్‌లో 150 డివిజన్లకు ఈనెల 2న పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయమే ప్రారంభం కావాల్సి ఉండగా పురానాపూల్ డివిజన్‌లో రీపోలింగ్ దృష్ట్యా మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. పురానాపూల్ రీపోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది కాబట్టి ఆ తర్వాతే అధికారికంగా ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటుచేశారు. మొదటి అరగంటలో పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంల్లో నిక్షిప్తమైన ఓట్లను లెక్కింపు ప్రారంభిస్తారు. దీనికోసం 24 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 5,626 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. 1674 టేబుళ్లు, 827 రౌండ్ల ద్వారా ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. రాత్రి 8 గంటలకల్లా పూర్తి ఫలితాలు వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







