చిక్కుడు వడలు

- May 24, 2015 , by Maagulf
చిక్కుడు వడలు

 

కావలసిన పదార్ధాలు:

  • చిక్కుడుకాయలు        - 1/4 కిలో
  • బియ్యప్పిండి              - 6 కప్పులు
  • ఉల్లిముక్కలు             - 2 1/2 కప్పులు
  • అల్లం తురుము           - 2 టీ స్పూన్లు
  • పచ్చిమిర్చి ముద్ద        - 2 టీ స్పూన్లు
  • కరివేపాకు                  - 5 రెబ్బలు
  • కొత్తిమీర తురుము       - 1 కప్పు
  • ఉప్పు                       - తగినంత
  • నూనె                        - వేయించడానికి సరిపడా

 

చేయు విధానం:

  • ముందుగా చిక్కుడుకాయల్ని శుభ్రం చేసి ఉడికించుకోవాలి.
  • ఓ గిన్నె తీసుకొని అందులో ఉడికించిన చిక్కుడుకాయలు, ఉల్లిముక్కలు, అల్లం తురుము, పచ్చిమిర్చి ముద్ద, కరివేపాకు తురుము, కొత్తిమీర, ఉప్పు, బియ్యప్పిండి వేసి ముద్దలా కలపాలి.
  • ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఒక్కో ముద్దనీ వడల్లా వత్తి నూనెలో వేయించుకుంటే చిక్కుడు వడలు రెడీ..

 

------ శిరీష, అబుధాబి, యు ఏ ఈ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com