ఇ-వీసా వెబ్‌సైట్‌కి కొత్త లుక్
- July 31, 2020
మనామా:ఇ-వీసా కోసం దరఖాస్తు చేసేందుకుగాను వినియోగించే వెబ్‌సైట్‌కి కొత్త లుక్‌ని ఆపాదించారు. నేషనాలిటీ పాస్‌పోర్ట్స్ అండ్ రెసిడెన్స్ ఎఫైర్స్ అథారిటీ, ఈ కొత్త వెబ్‌సైట్‌ని ప్రారంభించింది. బహ్రెయిన్‌లోకి ప్రవేశించాలనుకునేవారు ఎలక్ట్రానిక్ వీసా కోసం ఈ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుందని ఎప్‌పిఆర్‌ఎ పేర్కొంది. ఇన్‌స్టంట్ వీసా లేదా వీసా ఆన్ ఎరైవల్ కొన్ని రోజులపాటు రద్దు చేయబడుతుందని ఎప్‌పిఆర్‌ఎ వెల్లడించింది. వీసా ఆన్ ఎరైవల్, ఆన్‌లైన్ వీసా వంటి సౌకర్యాలు ఏయే దేశాలకు అమల్లో వున్నదీ ఈ వెబ్‌సైట్‌లో తెలియజేస్తారు. కేవలం వీసా ద్వారానే దేశంలో ప్రవేశించడానికి వీలుండదు. అవసరమైన నిబంధనలకు అనుగుణంగా అన్ని వివరాలు వుంటేనే సాధ్యమవుతుంది. ఎంట్రీ గ్రాంట్ అయితే, దానికి సంబంధించిన మొత్తాన్ని రిఫండ్ చేయడం అనేది జరగదు. కాగా, బహ్రెయిన్ ప్రభుత్వం తరఫున వేరే ఏ ఇతర వెబ్‌సైట్ లేదా కంపెనీాపరేట్ చేయదని ఎన్‌పిఆర్‌ఎ పేర్కొంది.ఇ-వీసా వెబ్సైటు వివరాలకు ఈ క్రింద లింకు క్లిక్ చెయ్యండి.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?