ఫోన్, వ్యాలెట్ దొంగతనం: నిందితుడికి మూడేళ్ళ జైలు
- August 01, 2020
మనామా:మొబైల్ ఫోన్ అలాగే వ్యాలెట్‌ని గ్రోసరీ స్టోర్ వర్కర్ నుంచి దొంగిలించిన నిందితుడికి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది ఫస్ట్ క్రిమినల్ కోర్ట్. ఈస్ట్ రిఫ్ఫాలో ఈ ఘటన జరిగింది. ఇన్ స్టోర్ సెక్యూరిటీ కెమెరాల్లో ఈ దొంగతనం వెలుగు చూసింది. నిందితుడు పారిపోతున్న వాహనాన్ని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గురించిన పోలీసులు, అతన్ని అరెస్ట్ చేశారు. దొంగిలించిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించగా, అతను కారులో పారిపోయినట్లు బాధితుడు ఫిర్యాదు చేశారు. విచారణలో ఆ కారు ఓ మహిళకు చెందినదిగా గుర్తించారు. ఆమె భర్త ఆ కారుని వినియోగిస్తున్నట్లు గురించారు. అయితే, ఆ వ్యక్తి తన సోదరుడు ఇన్‌టాక్సికేటింగ్ సబ్‌స్టాన్స్ ప్రభావంలో వున్నాడనీ, ఈ క్రమంలోనే ఇదంతా జరిగి వుండొచ్చని చెప్పారు. నిందితుడు, విచారణలో తన నేరాన్ని అంగీకరించాడు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







