6 నెలలకుపైగా స్వదేశాల్లో ఉన్న ప్రవాసీయులు కూడా కువైట్ రావొచ్చు.!

- August 02, 2020 , by Maagulf
6 నెలలకుపైగా స్వదేశాల్లో ఉన్న ప్రవాసీయులు కూడా కువైట్ రావొచ్చు.!

కువైట్ సిటీ:ఆరు నెలలకుపైగా ఇతర దేశాల్లో ఉన్న ప్రవాసీయులకు కువైట్ ప్రభుత్వం ఊరట కలిగించింది. ఆరు నెలలకుపైగా కువైట్ వదిలి వెళ్లిన ప్రవాసీయులు కూడా తిరిగి కువైట్ వచ్చేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు అధికారక ఉత్తర్వులు జారీ చేసింది. 2019, సెప్టెంబర్ 9 నాటి నుంచి కువైట్ వెళ్లిన వారిని తిరిగి అనుమతించాలంటూ కువైట్ పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ కార్యాలయం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సర్వీసులు అందించే అన్ని విమానయాన సంస్థలకు ఆదేశాలు ఇచ్చింది. అయితే..నివాస అనుమతి గడువు ముగియని వారికి మాత్రమే ఈ మినహాయింపు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది. దీంతో రెసిడెన్సీ పర్మిట్ గడువు ముగిసిన వారికి అనుమతి ఉండదు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com