'టెస్లా' వాహనాల రూపకర్త వ్యాఖ్యలపై స్పందించిన ఈజిప్ట్ ప్రభుత్వం
- August 03, 2020
వాషింగ్టన్: విద్యుత్ వాహనాల తయారీకి ఎలాన్ మస్క్ ఎంత ప్రసిద్ధో.. విచిత్ర వ్యాఖ్యలకు కూడా ఆయన అంతగా ప్రాచుర్యం పొందారు. సోషల్ మీడియా వేదికల్లో తరచూ వింత వింత వ్యాఖ్యలు చేస్తూ కల్లోలం సృష్టిస్తుంటారు. తాజాగా..పిరమిడ్లను గ్రహాంతర వాసులు నిర్మించినట్టున్నారు..స్పష్టంగా తెలుస్తోంది..అంటూ ఎలాన్ మస్క్ ట్విటర్ వేదికగా విచిత్ర వ్యాఖ్యలు చేశారు. అయన నిజంగానే ఇలా అన్నారా లేక జోక్ చేస్తున్నారా అనే దానిపై స్పష్టత లేనప్పటికీ ఈ ట్వీట్ తెగ వైరల్ అయింది. దాదాపు 5.4 లక్షల లైకులతో, 86 వేల రీట్వీట్లతో సోషల్ మీడియాను దున్నేసింది. మరి సహజంగానే ఈ ట్వీట్ ఈజిప్టు ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. దీంతో ఏకంగా ఆదేశ అంతర్జాతీయ వ్యవహారాల మంత్రి స్పందించారు. 'మస్క్.. మీ వర్క్‌ను ఎప్పటినుంచో ఫాలో అవుతున్నాను. అయితే మీరు ఓ సారి ఈజిప్టుకు రండి. పిరమిడ్లపై ఉన్న రాతలను పరిశీలించండి. పరమిడ్లను నిర్మించిన వారి సమాధుల్ని చూడండి. మీ కోసం వెయిట్ చేస్తున్నాం' అని ఆమె ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!