చైనీస్‌ న్యూ ఇయర్‌కి సర్వసన్నద్ధం

- February 05, 2016 , by Maagulf
చైనీస్‌ న్యూ ఇయర్‌కి సర్వసన్నద్ధం

యూఏఈలో అనధికారిక చైనా టౌన్‌ అన్నట్టుగా ఉండే డ్రాగన్‌ మార్ట్‌లో చైనా న్యూ ఇయర్‌ సెలబ్రేషన్‌కి రంగం సిద్ధమయ్యింది. ఫిబ్రవరి 8న కొత్త సంవత్సర వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు యూఏఈలోని చైనీయులు సిద్ధమవుతున్నారు. డ్రాగన్‌ డాన్సులతో, సంప్రదాయ నృత్యాలు, సాంస్కకృతిక కార్యక్రమాలతో న్యూ ఇయర్‌ వేడుకల్ని నిర్వహించనున్నారు. డ్రాగన్‌ మార్ట్‌ 1 మరియు డ్రాగన్‌ మార్ట్‌ 2 చైనీస్‌ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌కి వేదిక కానున్నాయి. ఫిబ్రవరి 8న ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో డ్రాగన్‌ డాన్సులు, ఫేస్‌ ఛేంజింగ్‌ షోస్‌, టీపాట్‌ సోస్‌, ఏరియల్‌ పెర్ఫామెన్సెస్‌, కుంగ్‌ఫూ మరియు చైనీస్‌ సంప్రదాయ నృత్యాలు ప్రధాన ఆకర్షణ కానున్నాయి. చైనా నుంచి ప్రత్యేకంగా వస్తున్న కొందరు నిపుణులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. యూఏఈలో 200,000 మందికి పైగా చైనీయులు ఉంటారనేది ఓ అఅంచనా. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com