వాట్సాప్ కొత్త ఫీచర్..ఫేక్‌న్యూస్ వ్యాప్తికి చెక్
- August 04, 2020
న్యూఢిల్లీ: కరోనా విజృంభనతో సోషల్ మీడియాలో తప్పుడు సమాచారానికి అడ్డుకట్ట వేసేందుకు కొద్ది రోజుల కింద వాట్సాప్ కొత్త విధానానికి తెర తీసింది. దీని ప్రకారం ఏదైనా సందేశాన్ని ఒకసారి కేవలం ఐదుగురికి మాత్రమే షేర్ చేయగలం. అయితే దీనితో ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించకపోయినప్పటికీ.. ఫేక్‌న్యూస్ స్వల్ప స్థాయిలో తగ్గిందని వాట్సాప్ చెప్పుకొచ్చింది.
కాగా ఇప్పుడు మరొక కొత్త ఫీచర్‌తో ఫేక్‌న్యూస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు వాట్సాప్ సిద్ధమైంది. యూజర్ల చేతనే సదరు సమాచారాన్ని నిజమా, అబద్దమా కనిపెట్టించి ఎక్కువ మందికి షేర్ కాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం సందేశం పక్కన బ్రౌజర్ ఫీచర్‌ను కొత్తగా యాడ్ చేశారు. ఆ బ్రౌజర్ ఫీచర్ ద్వారా సదరు సందేశానికి సంబంధించిన వివరాలను గూగుల్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఎలా పని చేస్తుందంటే..?
వాట్సాప్ కొత్త ఫీచర్ ఎక్కువ సార్లు ఫార్వార్డ్ చేయబడిన సందేశాలను శోధించడానికి సులభమైన మార్గాన్ని అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా బ్రౌజర్ ఫీచర్‌ను కొత్తగా పరిచయం చేసింది. వినియోగదారులకు వచ్చిన సందేశాలకు సంబంధించిన వివరాలను ఈ బ్రౌజర్ అందిస్తుంది. ఏదేని సందేశం గురించి శోధన చేయాలనుకుంటే దాని పక్కనే ఉండే ఈ బ్రౌజర్ ఫీచర్‌పై క్లిక్ చేసినట్లైతే గూగుల్ బ్రౌజర్ ద్వారా దానికి సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







