బ్యాక్ టు స్కూల్ డే కోసం సన్నాహాలు
- August 06, 2020
జెడ్డా: సౌదీ పేరెంట్స్, చిన్నారులు, టీచర్స్ అలాగే ఎడ్యుకేషన్ చీఫ్‌లు ఆగస్ట్ 30 నుంచి తిరిగి ప్రారంభం కానున్న స్కూళ్ళకు సంబంధించి సన్నాహాలు ప్రారంభించారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ డాక్టర్ హమాద్ బిన్ మొహమ్మద్ అల్ అషేక్ ఈ మేరకు వర్చువల్ మీటింగ్‌ని కింగ్డవ్ులోని పలువురు ఎడ్యుకేషన్ డైరెక్టర్స్‌తో ఏర్పాటు చేయడం జరిగింది. మెయిన్టెనెన్స్ మరియు ఆపరేషన్ వర్క్స్‌ని స్కూళ్ళలో పూర్తి చేయాలని ఈ సందర్భంగా మినిస్టర్ ఆదేశించారు. కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి 9న దేశంలోని స్కూళ్ళు, ఇతర విద్యా సంస్థల్ని మూసివేయడం జరిగింది. కరోనా వైరస్ ముప్పు ఇంకా తొలగిపోలేదనీ, ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని విద్యా సంస్థలు నిర్వహించాల్సి వుంటుందని మినిస్టర్ సూచించారు. కాగా, పిల్లలు స్కూళ్ళకు వెళ్ళడం అనేది ఏమంత క్షేమకరం రాదని, సోషల్ డిస్టెన్సింగ్ వంటివి పిల్లలకు అర్థం కావని కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?