దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి కన్నుమూత
- August 06, 2020
హైదరాబాద్:దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి (57) బుధవారం అర్థరాత్రి కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా 15 రోజుల క్రితం హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. 15 రోజుల క్రితం ఆయన కాలికి శస్త్ర చికిత్స జరిగింది. అది ఇన్ఫెక్షన్ కావడంతో పరిస్థితి విషమించి మరణించారు. దుబ్బాక మండలం చిట్టాపూర్ నకు చెందిన రామలింగారెడ్డి 2004,2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దొమ్మాట నియోజకవర్గం నుంచి తెరాస తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణ ఏర్పడిన తరువాత 2014,2018 సార్వత్రిక ఎన్నికలలోనూ గెలుపొందారు. ప్రస్తుతం శాసనసభ అంచనాల కమిటీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కీలక భూమిక పోషించారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.రామలింగా రెడ్డి మృతి పట్ల రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.రామలింగారెడ్డి మరణం తీరని లోటని హోం శాఖ మంత్రి అన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్ధించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?