మనామా: కింగ్ హమద్ జాతీయ రహదారిలో అభివృద్ధి పనులు..ట్రాఫిక్ పై ఆంక్షలు
- August 07, 2020
బహ్రెయిన్: మనామాలోని కింగ్ హమద్ హైవేపై చేపట్టిన అభివృద్ధి పనులతో జాతీయ రహదారి మీదుగా వెళ్లే ట్రాఫిక్ పై ఆంక్షలు విధించింది మున్సిపల్ వ్యవహారాలు, పట్టణ ప్రాణాళిక మంత్రిత్వ శాఖ. కింగ్ హమద్ జాతీయ రహదారిలోని హైవే 96, హవర్ హైవే (అస్కర్ జంక్షన్) మధ్య రహదారి ఇరు వైపుల ఓ లేన్ మూసివేస్తున్నట్లు వెల్లడించింది. దక్షిణం దిశగా వెళ్లే రహదారిలో కుడి లేన్ ను మూసివేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే..ఓ లేన్ ను మాత్రం వాహనదారులకు అందుబాటులో ఉండనుంది. అలాగే ఉత్తరం దిశగా వెళ్లే రహదారిలో కూడా కుడిలైన్ ను మూసివేసి..మరో లేన్ లో వాహనదారులను అనుమతించనున్నారు. కింగ్ హమద్ జాతీయ రహదారి మీదుగా ప్రయాణించే వాహనదారులు ఈ ఆంక్షలను గమనించాలని మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







