కువైట్ : స్వాతంత్య్ర వేడుకలపై కరోనా ఎఫెక్ట్..ఆన్ లైన్ లోనే వేడుకలు

- August 07, 2020 , by Maagulf
కువైట్ : స్వాతంత్య్ర వేడుకలపై కరోనా ఎఫెక్ట్..ఆన్ లైన్ లోనే వేడుకలు

కువైట్: కరోనా నేపథ్యంలో కువైట్ రాయబార కార్యాలయం స్వతంత్ర్య వేడుకలపై కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా రాయబార కార్యాలయంలో ఇండిపెండెన్స్ డే పబ్లిక్ సెలబ్రేషన్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్ట్ 15న ప్రవాసభారతీయులు, భారత శ్రేయోభిలాషులు ఎవరూ రాయబార కార్యాలయానికి రావొద్దని అధికారులు సూచించారు. అయితే..ఆన్ లైన్ ద్వారా త్రివర్ణ పతాకావిష్కరణ, రాయబార కార్యాలయం ప్రసంగాలను ప్రత్యక్షంగా వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అదేసమయంలో స్వతంత్ర్య వేడుకలను నేరుగా చూసే అవకాశం కొల్పోతున్నవారి కోసం ఆన్ లైన్ లో జాతీయ గీతం యాక్టివిటిని నిర్వహిస్తున్నారు. కువైట్ లోని ప్రవాసభారతీయులు జాతీయ గీతాన్ని ఆలపించి దాన్ని రికార్డ్ చేసి తమకు పంపించాలని కోరింది. రికార్డ్ చేసిన జాతీయ గీతంతో పాటు తమ పేరు, వయస్సు, ఇతర కాంటాక్ట్ వివరాలను [email protected] కు పంపించాలని రాయబార కార్యాలయం తెలిపింది. అందులో ఎంపిక చేసిన గీతాన్ని తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లు Facebook (@indianembassykuwait), Twitter (@indembkwt) లో అప్ లోడ్ చేస్తామని వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com