భారత్ లో ఒక్కరోజే 62,538 కరోనా పాజిటివ్ కేసులు
- August 07, 2020
భారత దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రతీ రోజుకు రికార్డు స్థాయిలో కేసుల సంఖ్య పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో 62,538 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజు 60 వేలకు పైగా కేసులు నమోదుకావడం ఇదే ప్రధమం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 20,27,075కు చేరింది.
అటు, మరణాలు కూడా ప్రతీరోజు రికార్డు సంఖ్యలో నమోదవుతున్నాయి. ఒక్క రోజే 886 మరణాలు సంభవించడంతో ఇప్పటి వరకు 41,585 మంది కరోనాతో మృతి చెందారు. కాగా.. ఇప్పటికవరకూ 13,78,106 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అవ్వగా.. 6,07,384 ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఓవైపు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నప్పటికీ.. రికవరీ రేటు కూడా అదే స్థాయిలో ఉండటం ఊరట కలిగిస్తుంది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 68 శాతానికి పెరిగింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







