మదినాలో దొంగతనం: ఐదుగురి అరెస్ట్‌

- August 08, 2020 , by Maagulf
మదినాలో దొంగతనం: ఐదుగురి అరెస్ట్‌

సౌదీ: ఇద్దరు సౌదీలు, ముగ్గురు యెమెనీ నివాసితుల్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులు మదీనాలోని ఓ ఇంట్లోకి దూరి 150,000 సౌదీ రియాల్స్‌ నగదు, అలాగే 1.2 మిలియన్‌ సౌదీ రియాల్స్‌ విలువైన నగల్ని దోచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్ట్‌ చేసినవారిని పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కి అప్పగించడం జరిగిందని మదీనా పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ అధికార ప్రతినిది¸ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హుస్సేన్‌ అల్‌ కహ్తాని చెప్పారు. మరో ఘటనలో ఇద్దరు సౌదీ వ్యక్తులు, ఓ యెమనీ రెసిడెంట్‌ని అరెస్ట్‌ చేశారు. మదీనాలోనే ఓ ఇంట్లో నిందితులు దోపిడీకి పాల్పడ్డారు. 380,000 సౌదీ రియాల్స్‌తోపాటు బంగారాన్ని నిందితులు దొంగిలించారు. దొంగిలించబడిన వస్తువుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com