రాజ్యసభ సచివాలయ ఉద్యోగుల గృహాలకు శంకుస్థాపన చేసిన ఉపరాష్ట్రపతి
- August 10, 2020
న్యూఢిల్లీ:రాజ్యసభ సచివాలయ ఉద్యోగుల కోసం 40 నివాస గృహాల నిర్మాణానికి ఉపరాష్ట్రపతి యం.వెంకయ్యనాయుడు సోమవారం ఆన్‌లైన్ వేదిక ద్వారా శంకుస్థాపన చేశారు. ఢిల్లీలోని ఆర్కే పురం సెక్టార్-12లో రూ.46 కోట్లతో ఈ నివాస సముదాయాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. 2003లోనే విలువైన ఈ స్థలాన్ని రాజ్యసభ సచివాలయానికి కేటాయించినప్పటికీ ఆ తర్వాత వివిధ అడ్డంకుల కారణంగా ఆలస్యం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభ సచివాలయ ఉద్యోగుల నివాస గృహాల విషయంలో తీవ్ర కొరత ఉందన్న ఆయన, రెండేళ్ళుగా ఈ అంశం మీద కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హార్దీప్ సింగ్ పురి సహా, సంబంధిత కేంద్ర ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులతో విస్తృత సమావేశాల తర్వాత ఈ అంశం కొలిక్కి వచ్చిందని తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?