కువైట్: ప్రవాసీయులకు వీసా పొడిగింపు లేదు..కానీ వారికి మాత్రం..
- August 12, 2020
విశ్వవిద్యాలయ డిగ్రీ లేనివారు మరియు 60 ఏళ్లు పైబడిన వారు ఏడాది తరువాత వీసాను పునరుద్ధరించలేరు.
కువైట్: ఆదివారం, జాతీయ అసెంబ్లీ మానవ వనరుల అభివృద్ధి కమిటీ కువైట్‌లో నిర్వాసితుల సంఖ్యను తగ్గించే విధానాలను, ఎంపీల ప్రతిపాదనలను సమీక్షించడం ప్రారంభించింది. 360,000 మంది నిర్వాసితుల నిష్క్రమణకు ప్రతిపాదించిన ప్రతిపాదనలలో ఒకటి: అక్రమ పర్మిట్ హోల్డర్లు, 60 ఏళ్లు పైబడిన ప్రవాసులు మరియు అవసరానికి మించి ఉన్న కార్మికులు సంఖ్య. తదనుగుణంగా 60 ఏళ్లు పైబడిన వారికి మరియు విశ్వవిద్యాలయ డిగ్రీని కలిగి లేనివారికి ఒక సంవత్సరం మాత్రమే వర్క్ పర్మిట్ పొడిగిస్తూ కువైట్ ప్రభుత్వం ప్రకటించింది.
జనాభా అసమతుల్యతను పరిష్కరించడానికి, ప్రైవేటు రంగంలో నిర్వాహక మరియు పర్యవేక్షక పదవులను సర్దుబాటు చేయడానికి మరియు కువైట్‌లోని కార్మికుల సంఖ్యను పర్యవేక్షించడానికి ఈ చర్య ప్రవేశపెట్టినట్టు అధికారుల వెల్లడి.
గణాంకాలు:
కువైట్‌లో 60 ఏళ్లు పైబడిన 83,562 మంది నిర్వాసితులు ఉన్నారని కార్మిక గణాంకాలు కనుగొన్నాయి. అందులో 15,847 మంది నిరక్షరాస్యులు కాగా 24,000 మంది చదవగలిగినవారు మరియు వ్రాయగలిగినవారు ఉన్నారు. 10,000 మంది ప్రాధమిక డిగ్రీ, 16,000 మంది ఇంటర్మీడియట్ డిప్లొమా మరియు 16,000 మంది హైస్కూల్ డిప్లొమా కలిగి ఉన్నారు.
కరోనా వ్యాప్తికి వీరే కారణమట!
కువైట్ జాతీయ అసెంబ్లీ లో జనాభా అసమతుల్యతను వివిధ ప్రభుత్వ అధికారులు మరియు ఎంపీలు నిలదీయటం జరిగింది. కువైట్‌లో జనాభాలో 70 శాతం మంది నిర్వాసితులు అని ఎత్తిచూపారు.కువైట్ దేశస్తులలో విదేశీయుల యెడ అసాధారణ భయము మరియు ద్వేషం వ్యక్తం అవ్వుతుండడం గమనార్హం. కువైట్ లో కరోనా వైరస్ వ్యాప్తికి అధిక సంఖ్యలో ప్రజలు నిర్వాసితులను నిందించారు.
తాజా వార్తలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం







