కోజికోడ్ ఫ్లైట్ బాధితులకు ఆర్ధిక సాయం..దాతృత్వం చాటుకున్న యూఏఈ వ్యాపారవేత్త
- August 12, 2020
యూఏఈలో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త అల్ అదిల్ ట్రేడింగ్ డైరెక్టర్ డాక్టర్ ధనుంజయ్ దతర్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కేరళాలోని కోజికోడ్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కొల్పోయిన వారి కుటుంబాలకు 20 లక్షల రూపాయల ఆర్ధిక సాయం ప్రకటించారు. విమాన ప్రమాదంలో ఫ్లైట్ ను కమాండ్ చేసిన పైలట్ కెప్టెన్ దీపక్ వసంత్ సాథే మరణించిన వార్త తనను ఎంతగానో కలిచి వేసిందని ధునుంజయ్ తెలిపారు. తన నాన్న కూడా గతంలో భారత వైమానిక దళంలో విధులు నిర్వహించారని...ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తో తనకు బలమైన అనుబంధం ఉందని ఆయన అన్నారు. ప్రమాద విషయం తెలియగానే బాధితులను ఎదో విధంగా ఆదుకునేందుకు తనవంతు సాయం అందించాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు ధనుంజయ్. అంతేకాదు..కోజికోడ్ ఎయిర్ పోర్టులో ప్రమాదానికి గురైన విమాన ప్రయాణికుల్లో ఎక్కువ మంది విజిట్ విసా గడువు ముగిసిన వారు, ఉద్యోగాలు కొల్పోయి ఆర్ధిక ఇబ్బందులతో సొంతూళ్లకు బయల్దేరిన వారేనని ఆయన అన్నారు. అసలే ఆర్ధికంగా ఒడిదుడుకులు ఎదుర్కుంటున్న వారి కుటుంబాలు..ఇంటి పెద్ద దిక్కును కొల్పోవటం ఎవరూ పూడ్చలేని లోటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారికి తనకు చేతనైనంత సాయం అందిస్తున్నానని వ్యాపారవేత్త ధనుంజయ్ చెప్పారు.
తాజా వార్తలు
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్‌లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం
- పవన్ కల్యాణ్‌కు సర్జరీ సక్సెస్..త్వరగా కోలుకోవాలన్న సీఎం చంద్రబాబు!
- వేసవి రద్దీకి దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ సిద్ధం..







