ఆగస్ట్ 15న రానున్న 'గుడ్‌లక్ సఖి' టీజర్
- August 13, 2020
కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్న లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ 'గుడ్‌లక్ సఖి'. ఎక్కువగా మహిళలే పనిచేస్తున్న ఈ చిత్రానికి శ్రావ్య వర్మ సహ నిర్మాత.
నగేష్ కుకునూర్ డైరెక్టర్ చేస్తోన్న ఈ సినిమా ఏక కాలంలో తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో నిర్మాణమవుతోంది.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పిస్తున్న ఈ మూవీని వర్త్ ఎ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్‌పై సుధీర్‌చంద్ర పాదిరి నిర్మిస్తున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న ఉదయం 10 గంటలకు 'గుడ్‌లక్ సఖి' టీజర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో కీర్తి సురేష్ గ్రామీణ ప్రాంత యువతిగా కనిపిస్తున్నారు.
స్పోర్ట్స్ రామ్ కామ్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్ షూటర్‌గా నటిస్తున్నారు.
రాక్‌స్టార్ దేవి శ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా, చిరంతన్ దాస్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
ఒక చిన్న షూటింగ్ షెడ్యూల్ మినహా మిగతా ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగింపు దశలో ఉన్నాయి.
ప్రధాన తారాగణం:
కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతిబాబు
సాంకేతిక బృందం:
మ్యూజిక్: దేవి శ్రీప్రసాద్
సినిమాటోగ్రఫీ: చిరంతన్ దాస్
సహ నిర్మాత: శ్రావ్య వర్మ
సమర్పణ: దిల్ రాజు (శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్)
నిర్మాత: సుధీర్‌చంద్ర పాదిరి
దర్శకత్వం: నగేష్ కుకునూర్
బ్యానర్: వర్త్ ఎ షాట్ మోషన్ ఆర్ట్స్
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







